వైసీపీలో ముసలం.. నెల్లూరు నుంచి  గన్నవరం వరకు గరంగరం
3 February, 2023
వైసీపీలో ముసలం.. నెల్లూరు నుంచి గన్నవరం వరకు గరంగరం

అంతర్గత కుమ్ములాటలు, అసమ్మతి స్వరాలు, తిరుగుబాటు రాజకీయాలతో అధికార వైసీపీ కుతకుతలాడిపోతోంది. నెల్లూరు వైసీపీలో మొదలైన ముసలం రాష్ట్రమంతా అంటుకుంటోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఆనం, కోటంరెడ్డిల కారణంగా వైసీపీ అధిష్టానం కిందా మీద పడుతోంది. ఇక ఇది చాలదన్నట్లు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా లైన్ లోకి వచ్చారు. తన నియోజకవర్గంలో పరిశీలకుడు ఇబ్బంది పెడుతున్నాడంటోన్న మేకపాటి పద్ధతి మార్చుకోకపోతే దేనికైనా సిద్ధమంటున్నారు. ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుండగానే ముఖ్యమంత్రికి మరో తలనొప్పి మొదలైంది. గన్నవరంలో […]

కూర్చున్న కొమ్మను నరుక్కున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
1 February, 2023
కూర్చున్న కొమ్మను నరుక్కున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నియోజకవర్గానికి నిధులు ఇవ్వడంలేదనో అభివృద్ధిపై అసంతృప్తి ఉందనో చెప్పుంటే గౌరవంగా ఉండేది. కానీ నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే నా మాటలెవరో రహస్యంగా వింటున్నారనడం అతిశయోక్తిలా ఉంది. ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నారన్నది కోటంరెడ్డివాదన. దానికి ఆయన ఇంటలిజెన్స్‌ చీఫ్‌ పేరుని బయటికి లాగారు. తన స్నేహితుడితో మాట్లాడిన కాల్‌ ఆడియోని ఆ ఐపీఎస్‌ షేర్‌ చేశారంటున్నారు. బట్టకాల్చి మొహానేసినట్టు ట్యాపింగ్‌ జరగలేదని నిరూపించుకోవాలని అంటున్నారు. ఇదెక్కడి విడ్డూరం. ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నా వారు గీటుదాటినా పార్టీకి ద్రోహం […]

ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్‌ ట్యాంపింగ్ కలకలం
1 February, 2023
ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్‌ ట్యాంపింగ్ కలకలం

సాధారణంగా ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఆరోపిస్తూ ఉంటారు. కానీ ఆంధ్రప‌్రదేశ్‌లో పరిస్థితి తిరగబడినట్లు కనిపిస్తోంది. తమ ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం విస్మయం కలిగిస్తోంది. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. తరచుగా ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల సీఎం జగన్‌ ఆయనను పిలిపించుకుని మాట్టాడారు. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనకపోతే […]

1 2 87 88 89 107 108