పార్టీ మారితే  ఇద్దరం మారుతాం..మాజీ హోంమంత్రి సుచరిత
5 January, 2023
పార్టీ మారితే ఇద్దరం మారుతాం..మాజీ హోంమంత్రి సుచరిత

మంత్రి పదవి పోయిన నాటి నుంచి మాజీ హోంమంత్రి సుచరితలో మార్పు కనిపిస్తోంది. పార్టీకి విధేయులుగా ఉంటామంటూనే కొంత పరేషాన్ చేస్తున్నారు. కేబినెట్ నుంచి ఉద్వాసన పలికాక రాజీనామాకు సిద్ధపడిన సుచరిత అధినేత పిలిచి మాట్లాడడంతో శాంతించారు. వైసీపీలోనే కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత కొంతకాలానికే తనకు అప్పజెప్పిన జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొని షాక్ ఇచ్చారు. నియోజకవర్గానికి సమయం వెచ్చించేందుకే అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆమె చెప్పినా డొక్కాకు బాధ్యతల నేపథ్యంలోనే ఆమెను […]

వైసీపీలో అలకలు.. ఒక్కరొక్కరుగా విమర్శల జడివాన
5 January, 2023
వైసీపీలో అలకలు.. ఒక్కరొక్కరుగా విమర్శల జడివాన

జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు స్వచ్ఛందంగా వచ్చి చేరిన వాళ్లంతా ఇప్పుడు అసంతృప్తితో పక్కచూపులు చూస్తున్నారు. పార్టీ కోసం ప్రాణం ఇస్తామనే వారి సంఖ్య తగ్గిపోతోంది. అధినేతకు షాకులిచ్చే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. పార్టీలో రెబెల్‌ వ్యవహారాలు ఎక్కువవుతున్నాయని ఫ్యాన్‌ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతుండగా వైసీపీలో అసమ్మతి స్వరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చాటుమాటుగా కాకుండా నేతలంతా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా జగన్‌ మాటే వేదవాక్కు అంటూ చెప్పుకొచ్చిన […]

జగన్ ఎమ్మెల్యేల ధిక్కార స్వరం
4 January, 2023
జగన్ ఎమ్మెల్యేల ధిక్కార స్వరం

ఏపీ అధికార పార్టీలో అసలేం జరుగుతోంది?ప్రత్యర్థుల కన్నా సొంత పార్టీ ఎమ్మెల్యేలే సీఎం జగన్‌ను భయపెడుతున్నారు. పార్టీ, ప్రభుత్వ తీరుపై కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు అధినాయకత్వాన్ని తలబొప్పి కట్టిస్తున్నాయట. ఎన్నికలకు ముందు చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలపై పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే పార్టీపై తిరుగుబాటు చేసిన ఎంపీ రఘురామకృష్ణం రాజు అప్పట్నుంచి నిత్యం జగన్ సర్కార్‌పై విమర్శలతో విరుచుకుపడుతూనే ఉన్నారు. పార్టీ, ముఖ్యమంత్రి, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని […]

అవ‌న్నీ మ‌ర్చిపోతారా కేసీఆర్‌..వాట్ టూడూ..
4 January, 2023
అవ‌న్నీ మ‌ర్చిపోతారా కేసీఆర్‌..వాట్ టూడూ..

పేడ‌బిర్యానీ అన్నారు. త‌న్నిత‌రిమేస్తామ‌న్న‌ట్లు మాట్లాడారు. ఇప్ప‌టికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో ఉన్న విభ‌జ‌న వివాదాల‌పై పంతాల‌కు పోతున్నారు. ఆంధ్ర మూలాలున్న నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తే మీ రాష్ట్రానికి పోయి రాజ‌కీయం చేసుకోండ‌న్న‌ట్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడేమో భార‌త్ రాష్ట్ర స‌మితిని దేశ‌వ్యాప్తంగా విస్త‌రించామంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై దృష్టిపెట్టారు. తెలంగాణ త‌ర్వాత కేసీఆర్ జాతీయ‌పార్టీ ప్ర‌ధాన ల‌క్ష్యం ఏపీనే. అక్క‌డ త‌న‌ను అభిమానించేవారున్నార‌ని బోణీ బాగుంటుంద‌న్నది గులాబీపార్టీ అధినేత ఆలోచ‌న‌. అయితే ఓ చంద్ర‌శేఖ‌ర్‌ మ‌రో రావెల‌కిషోర్ వ‌చ్చి చేర‌గానే అద్భుతాలు జ‌రిగిపోవు. ఏపీలో […]

1 2 97 98 99 107 108