సేవ్ డెమాక్రసీ.. మోడీకి విప‌క్ష‌నేతల లేఖాస్త్రం
6 March, 2023
సేవ్ డెమాక్రసీ.. మోడీకి విప‌క్ష‌నేతల లేఖాస్త్రం

దేశంలో ఈడీ దాడులు కొత్త కాదు. సీబీఐ కేసులు ఆగ‌లేదు. ఇక ఆదాయ‌పుప‌న్నుశాఖ ఎప్పుడు ఎవ‌రి మీద కొరడా ఝుళిపిస్తుందో తెలీదు. దేశంలో ద‌ర్యాప్తుసంస్థ‌ల దుర్వినియోగం జ‌రుగుతోంద‌న్న ఆరోప‌ణ‌ల ఈమ‌ధ్య ఎక్కువైంది. కేంద్రంలో ఎన్డీఏ ప్ర‌భుత్వం రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక విప‌క్ష‌నేత‌లే ఎక్కువ‌గా టార్గెట్ అవుతున్నారు. ఏమీ లేక‌పోయినా కేసుల్లో ఇరికిస్తున్నారా అంటే లేదు. ఏ చిన్న‌త‌ప్పు దొరికినా త‌ప్పించుకునే అవ‌కాశం లేకుండా ద‌ర్యాప్తుసంస్థ‌లు ఉచ్చు బిగిస్తున్నాయి. లిక్క‌ర్ స్కామ్‌లో ఈడీ, సీబీఐలకు వీస‌మెత్తు ఆధారం దొర‌క‌లేద‌ని […]

ఈశాన్య రాష్ట్రాల్లోనూ బలపడుతున్న బీజేపీ
3 March, 2023
ఈశాన్య రాష్ట్రాల్లోనూ బలపడుతున్న బీజేపీ

ఈశాన్యం. అక్కడి సంస్కృతి వేరు. ఆచార వ్యవ‌హారాలు వేరు. హిందూ సెంటిమెంట్ పెద్దగా ప‌నిచేయ‌దు. అయినా ఆ రాష్ట్రాల్లోనూ కాషాయం రెప‌రెప‌లాడింది. క‌మ్యూనిస్టుల కంచుకోట త్రిపుర‌ని ఇదివ‌ర‌కే బ‌ద్దలు కొట్టిన బీజేపీ మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప‌ట్టు బిగిస్తోంది. అస్సాం, త్రిపుర సాంకేతికంగా హిందూ జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాలు. కాబ‌ట్టే బీజేపీకి క‌లిసొచ్చింద‌ని అనుకోవ‌చ్చు. కానీ క్రిస్టియన్లు, గిరిజనులు ఎక్కువ‌గా ఉండే మేఘాలయ, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఎలా పాగావేయ‌గ‌లుగుతోంద‌న్నదే రాజ‌కీయ విశ్లేష‌కుల‌ను ఆశ్చర్యంలో […]

ఎలక్షన్‌ కమిషన్‌పై సుప్రీం నిర్ణయం.. మార్పు మంచిదే
3 March, 2023
ఎలక్షన్‌ కమిషన్‌పై సుప్రీం నిర్ణయం.. మార్పు మంచిదే

దర్యాప్తు సంస్థలు పంజరంలో చిలుకలైపోతున్నాయి. ఎన్నికల కమిషన్‌మీద కూడా అపవాదులు ఉన్నాయి. న్యాయవ్యవస్థలోనూ జోక్యం చేసుకోవడానికి ఓ పక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈవీఎంల మీద అనుమానాలు వస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌మీద అపనిందలు ఎదురవుతున్నాయి. ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా ఉండటం లేదన్న అభిప్రాయం చాన్నాళ్లుగా ఉంది. శేషన్‌లాంటి అధికారి వస్తేనే ఈ వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఈ సమయంలో ఎన్నికల కమిషన్‌పై సంచలన నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. ఇకనుంచి నచ్చినోళ్లను ఎన్నికల కమిషన్‌లో పెట్టడం […]

1 2 17 18 19 31 32