అదానీ దెబ్బ‌కు ఎల్ఐసి ఖ‌ల్లాస్‌
27 February, 2023
అదానీ దెబ్బ‌కు ఎల్ఐసి ఖ‌ల్లాస్‌

వ్యాపార‌సామ్రాజ్యం న‌మ్మ‌కంతో ఎద‌గాలి అభూత‌క‌ల్ప‌న‌ల‌తో కాదు. అంకెలగారడీతో ప్ర‌పంచ కుబేరుడిగా ఎదిగిన గౌత‌మ్ అదానీ సామ్రాజ్యం పేక‌మేడ‌లా కూలిపోతోంది. దారుణాతిదారుణంగా షేర్లు ప‌త‌న‌మ‌వుతున్నాయి. అదానీ సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెడితే లాభాలొస్తాయ‌ని ఆశ‌ప‌డ్డ సామాన్య మ‌దుప‌రులు, పెద్ద పెద్ద సంస్థ‌లు భారీ న‌ష్టాల్ని మూట‌గ‌ట్టుకుంటున్నాయి. అదానీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి ఎల్‌ఐసీని ముంచేస్తోంది. ఆయా సంస్థల షేర్లలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ పెట్టిన పెట్టుబడులూ దారుణంగా తరిగిపోతున్నాయి. ఈక్విటీల్లో 30వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టంది ఎల్ఐసి. త‌మ విలువ […]

సోనియాకు రాజ‌కీయ వైరాగ్యం వ‌చ్చేసిందా
26 February, 2023
సోనియాకు రాజ‌కీయ వైరాగ్యం వ‌చ్చేసిందా

ఇందిరాగాంధీ బ‌తికున్న‌ప్పుడు అత్త‌చాటుకోడ‌లు. రాజీవ్‌గాంధీ రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు తెర‌చాటునే ఉన్నారామె. భ‌ర్త హ‌త్య‌త‌ర్వాతే పార్టీకి పెద్ద‌దిక్క‌య్యారు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే సోనియాగాంధీ. సోనియా అంటే కాంగ్రెస్‌పార్టీ. వార‌సుడు బాధ్య‌త‌లు నెత్తినేసుకోవ‌డానికి సిద్ధంగా లేక‌పోయినా త‌న ఆరోగ్యం స‌హ‌క‌రించ‌పోయినా పార్టీకి తానే పెద్ద‌దిక్కుగా ఉన్నారు సోనియాగాంధీ. మ‌ల్లికార్జున‌ఖ‌ర్గే ఏఐసీసీ అధ్య‌క్షుడైనా ఆ పార్టీకి దిశానిర్దేశం చేస్తూ వ‌చ్చింది మాత్రం సోనియాగాంధీనే. అలాంటి సోనియాగాంధీ రాయ్‌పూర్ ప్లీన‌రీలో రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెబుతున్న‌ట్లు చేసిన ప్ర‌క‌ట‌న కాంగ్రెస్ శ్రేణుల‌ను గంద‌ర‌గోళంలో ప‌డేసింది. […]

ఖ‌లిస్తాన్‌.. పంజాబ్ ఇంకా నివురుగ‌ప్పిన నిప్పే
25 February, 2023
ఖ‌లిస్తాన్‌.. పంజాబ్ ఇంకా నివురుగ‌ప్పిన నిప్పే

బింద్ర‌న్‌వాలే. స్వ‌ర్ణ‌దేవాల‌యం. ఎవ‌రూ మ‌ర్చిపోలేదిప్ప‌టికీ. మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ హ‌త్య‌కు కార‌ణ‌మైంది ఆ వేర్పాటువాద‌మే. స్వ‌ర్ణ‌దేవాల‌యంపై ఆప‌రేష‌న్ బ్లూస్టార్ చేయించినందుకు ప్ర‌తీకారంగా ఇందిరాగాంధీ హ‌త్య జ‌రిగింది. అంగ‌ర‌క్ష‌కులే ఇందిరాగాంధీని కాల్చిచంపారు. ఆ త‌ర్వాత జ‌రిగిన సిక్కుల ఊచ‌కోత ఇప్ప‌టికీ మ‌న‌దేశానికి మాయ‌నిమ‌చ్చ‌గానే ఉంది. పాకిస్తాన్‌లా ఖ‌లిస్తాన్ ఏర్పాటుకోసం అప్ప‌ట్లో బుస‌లుకొట్టిన వేర్పాటువాదాన్ని క‌ఠినంగా అణ‌చివేసింది ఇందిరాగాంధీ. దేశ‌భ‌ద్ర‌త‌కే ముప్పుగా మారిన బింద్ర‌న్‌వాలేని ఆ ఆప‌రేష‌న్‌లో తుద‌ముట్టించింది. త‌ర్వాత ఖ‌లిస్తానీ వేర్పాటువాదం త‌గ్గుముఖం ప‌ట్టినా పూర్తిగా తెర‌మరుగైతే కాలేదు. […]

1 2 18 19 20 31 32