యువతను ఆకర్షించడమే లక్ష్యం.. విద్య, ఉద్యోగరంగాలపై స్పెషల్ ఫోకస్
కేంద్రంలో హ్యాట్రిక్ విజయం కోసం పరితపిస్తోన్న మోడీ సర్కార్ రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చివరి బడ్జెట్ను రూపొందించింది. యువతను ఆకర్షించడమే లక్ష్యంగా బడ్జెట్లో విద్య, ఉద్యోగ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈసారి విద్యార్థుల కోసం అనేక ప్రకటనలు వెలువడ్డాయి. 2023 ఆర్థిక బడ్జెట్లో విద్యకు రూ.1,12,899 కోట్లు కేటాయించారు. ఇది 2022-23 బడ్జెట్ అంచనా కంటే రూ.8,621 కోట్లు ఎక్కువ. ఇందులో డిజిటల్ లైబ్రరీ నుంచి ల్యాబ్ మేడ్ డైమండ్లకు గ్రాంట్లు ఇచ్చారు. పిల్లలు […]