ప‌న్నులందు నిర్మ‌లా సీతారామ‌న్ టాక్స్ వేర‌యా!
2 February, 2023
ప‌న్నులందు నిర్మ‌లా సీతారామ‌న్ టాక్స్ వేర‌యా!

బాధ్య‌త‌గ‌ల పౌరులుగా ప‌న్నులు క‌ట్టాల్సిందే. అయితే దేశంలో ఎంత ఆదాయానికి ప‌న్ను క‌ట్టాల‌న్న‌దానిపై ఎప్పుడూ కేంద్రం దోబూచులాడుతూనే ఉంది. క్ర‌మం త‌ప్ప‌కుండా ఇన్‌కంటాక్స్ క‌ట్టే వేత‌న‌జీవికి ఎప్ప‌టిక‌ప్పుడు అసంతృప్తే మిగులుతోంది. ఈ బ‌డ్జెట్‌లో కూడా ఆదాయ‌పుప‌న్ను మిన‌హాయింపుల‌పై అంతా ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటే అందులోనూ కేంద్రం డ‌బ‌ల్‌గేమ్ ఆడింది. పాత‌ కొత్త ప‌న్ను విధానాల మ‌ధ్య విభ‌జ‌న‌రేఖ గీసింది. ఇప్ప‌టిదాకా పాత ప‌న్ను విధానంలో 2020లో ప్ర‌క‌టించిన కొత్త టాక్స్ పాల‌సీలో రూ.5ల‌క్ష‌ల ఆదాయం దాకా ప‌న్ను […]

ప‌ప్పు తుప్పు కాదు త‌న‌లోనూ ఫైర్ ఉంది!
31 January, 2023
ప‌ప్పు తుప్పు కాదు త‌న‌లోనూ ఫైర్ ఉంది!

రాహుల్‌గాంధీ న‌డ‌క ఆగింది. భార‌త్ జోడో అంటూ రాహుల్‌యాత్ర పాద‌యాత్ర మొద‌లుపెట్టిన‌ప్పుడు ఎవ‌రికీ ఎలాంటి అంచ‌నాలు లేవు. కానీ క‌న్యాకుమారిలో మొద‌లైన కాంగ్రెస్ యువ‌రాజు న‌డ‌క చివ‌రికి మంచుకొండ‌ల‌మ‌ధ్య ముగిసింది. భారీ హిమ‌పాతం మ‌ధ్యే క‌శ్మీర్‌లో భావోద్వేగ ప్ర‌సంగంతో పాద‌యాత్ర‌కు ముగింపు ప‌లికారు రాహుల్‌గాంధీ. రాహుల్ పాద‌యాత్ర‌తో కాంగ్రెస్ అసాధార‌ణంగా పుంజుకుంటుందా. మ‌ళ్లీ అధికారంలోకి రాగ‌లుగుతుందా అన్న‌ది కానే కాదు. ఈ పాద‌యాత్ర రాహుల్‌గాంధీలో కొత్త కోణాన్ని ఆవిష్క‌రించింది. ఇన్నేళ్లూ త‌ల్లిచాటుబిడ్డ‌గానో వార‌స‌త్వాన్నే న‌మ్ముకున్న నాయ‌కుడిగానో ప‌రిమిత‌మైన […]

కేసు వేస్తావా వేస్కో.. మా లెక్క ప‌క్కా!
28 January, 2023
కేసు వేస్తావా వేస్కో.. మా లెక్క ప‌క్కా!

అదానీ ముసుగు తొల‌గిపోయింది. కేంద్రంలోని కొంద‌రు పెద్ద‌ల ఆశీస్సుల‌తో ప్ర‌పంచ కుబేరుల జాబితాలో చేరిపోయిన అదానీ ఎదుగుద‌ల వెనుక ఎన్ని అక్ర‌మ సోపానాలున్నాయో బ‌య‌టికొచ్చింది. షేర్ల‌ను హాట్‌కేకుల్లా అమ్మేసుకుని జ‌నాన్ని వేల‌కోట్లు ముంచేసిన బిగ్ చీట‌ర్‌లా చూస్తున్నారిప్పుడు. అంబానీని మించిపోదామ‌నుకున్న స‌మ‌యంలో త‌న చీక‌టికోణం బ‌య‌టపడ్డా తేలుకుట్టిన దొంగ‌లా ఉండ‌టంలేదు అదానీ. త‌న‌వెనుక ఏదో కుట్ర జ‌రిగిందంటున్నారు. నివేదిక బ‌య‌ట‌పెట్టిన సంస్థ‌ను కోర్టుకు ఈడుస్తానంటున్నారు. 20వేల కోట్ల అదానీ ఎంట‌ర్‌ప్రైజ‌స్ ఎఫ్‌పీవోను దెబ్బ‌తీసేందుకే ఇలాంటి నివేదిక‌ను తెర‌పైకి […]

ఈ ఏడాది అన్ని రాజకీయ పార్టీలకు కఠిన పరీక్ష
27 January, 2023
ఈ ఏడాది అన్ని రాజకీయ పార్టీలకు కఠిన పరీక్ష

కేంద్రంలో రెండుసార్లు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన మోడీ వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈసారి గెలుపు అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలో తిరుగులేని రాజకీయపార్టీగా అవతరించిన భారతీయ జనతాపార్టీకి 2023వ సంవత్సరం అత్యంత క్లిష్టమైన సవాల్‌ను విసరబోతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాల రాజకీయ చాణక్యానికి కఠిన పరీక్ష ఎదురుకాబోతోంది. ఓ వైపు దేశమంతా రాహుల్ భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. […]

1 2 23 24 25 31 32