భీమాకొరెగావ్ కేసు.. సాక్ష్యాల్లో వాస్తవం ఎంత?
భావస్వేచ్ఛ ఈ ప్రజాస్వామ్యం మనకిచ్చిన హక్కు. ఆ స్వేచ్ఛ నోరెత్తలేని బడుగుజీవులెందరికో ఆశాదీపం కావచ్చు. కానీ ఆ గళం కొందరిని భయపెట్టొచ్చు. సమాజం గురించి, అసమానతల గురించి మాట్లాడినవారు అర్బన్ నక్సలైట్లు అవుతున్నారు. అన్యాయాలు, అసహనం గురించి గొంతెత్తేవారు దేశద్రోహులుగా మిగిలిపోతున్నారు. భీమాకొరెగావ్ కేసు సామాన్యులకే కాదు మేథావులకు కూడా అంతుపట్టని బ్రహ్మపదార్థమే. ఏడుపదులు నిండినవారు, వీల్‌చైర్లకే పరిమితమైనవారు కూడా జైళ్లలో మగ్గాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో ఈ సమాజానికి ఇప్పటికీ జవాబులేని ప్రశ్నే. భీమాకొరెగావ్ కేసులో అరెస్టయినవారికి […]