సీఎం కేసీఆర్‌కు ఢిల్లీలో ఊహించని షాక్‌
13 December, 2022
సీఎం కేసీఆర్‌కు ఢిల్లీలో ఊహించని షాక్‌

ఆదిలోనే హంసపాదు అన్నట్లయింది. బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందు సీఎం కేసీఆర్‌కు షాక్‌ ఇచ్చారు ఢిల్లీ మున్సిపల్ అధికారులు. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలనుకుంటున్న కేసీఆర్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో సిద్ధమైన బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయానికి రేపు ప్రారంభోత్సవం చేయనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా హస్తనకు చేరుకున్నారు. ఈరోజు, రేపు పార్టీ కార్యాలయంలో రాజశ్యామల నవచండీ యాగం నిర్వహిస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ కార్యాలయం […]

ఉత్త‌రాఖండ్ సీఎం సుఖ్వింద‌ర్‌సింగ్‌
11 December, 2022
ఉత్త‌రాఖండ్ సీఎం సుఖ్వింద‌ర్‌సింగ్‌

సుఖ్వింద‌ర్‌.. సిన్సియ‌ర్ లీడ‌ర్‌కి సీఎం ప‌ద‌వి ఎన్నో ఓట‌ముల మ‌ధ్య చీక‌ట్లో చిరుదివ్వెలా కాంగ్రెస్‌కో గెలుపు. ఉత్త‌రాఖండ్ విజ‌యంతో కాంగ్రెస్ ఆశ‌లు చిగురించాయి. మోడీ మేనియాలో తెర‌మ‌రుగైపోతామ‌న్న భ‌యాన్ని ఉత్త‌రాఖండ్ విజ‌యం కాస్త దూరం చేసింది. గుజ‌రాత్‌లో దారుణంగా దెబ్బ‌తిన్నా ఉత్త‌రాఖండ్‌లో బీజేపీ స‌ర్కారుని కాంగ్రెస్ గ‌ద్దెదించ‌గ‌లిగింది. ష‌రామామూలుగానే సీఎం సీటుకోసం కొట్లాటతో కాంగ్రెస్ కొంప‌మునుగుతుంద‌ని అనుకున్నారు. కానీ అంద‌రికీ ఆమోద‌యోగ్యుడైన నాయ‌కుడిని ఎంచుకుని కాంగ్రెస్ విజ్ఞత‌ను ప్ర‌ద‌ర్శించింది. సుఖ్వింద‌ర్‌సింగ్ ఉత్త‌రాఖండ్ కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి. నాలుగు దశాబ్దాలుగా […]

చేజారిన హిమాచ‌ల్‌.. బీజేపీ ఏం చేయ‌బోతోంది?
10 December, 2022
చేజారిన హిమాచ‌ల్‌.. బీజేపీ ఏం చేయ‌బోతోంది?

న‌డ్డాపై వేటు త‌ప్ప‌దా? అనురాగ్ కూడా ఔటేనా? గుజ‌రాత్ గెలుపు మోడీషా ఖాతాలో. గుజ‌రాతే కాదు దేశంలో ఎక్క‌డ క‌మ‌ల‌వికాసం జ‌రిగినా ఆక్రెడిట్ వాళ్లిద్ద‌రికే. ఎందుకంటే మోడ్ర‌న్ బీజేపీకి మోదీ, అమిత్‌షాలే సర్వం. మ‌రి ఎక్క‌డైనా ఓడిపోతే కార‌కులెవ‌రు? ఏ పార్టీలోనైనా దానికోసం బ‌క‌రాలుంటారు. బ‌లైపోతుంటారు. బీజేపీలో ఇప్పుడ‌దే జ‌ర‌గ‌బోతోంది. గుజ‌రాత్‌లో ఏడోసారి తిరుగులేని విజ‌యం ద‌క్కినా త‌మ పార్టీ అధికారంలో ఉన్న మ‌రోరాష్ట్రం హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ చేజారిపోవ‌డాన్ని బీజేపీ జీర్ణించుకోలేక‌పోతోంది. హిమాచ‌ల్‌లో ఓట‌మిపై బీజేపీలో పోస్ట్‌మార్టం మొద‌లైంది. […]

1 2 29 30 31 32