చైనా టూ సింగపూర్‌.. కుబేరుల వలసలు షురూ
4 February, 2023
చైనా టూ సింగపూర్‌.. కుబేరుల వలసలు షురూ

ప్రభుత్వ విధానాలు బావుంటే పరిశ్రమలు వస్తాయి. సురక్షితమని భావిస్తే సంపాదించింది అక్కడే ఖర్చుపెడుతుంటారు. వ్యాపార విస్తరణకు చొరవచూపిస్తారు. కానీ ఎప్పుడేం జరుగుతుందో తెలీని పరిస్థితి ఉంటే తట్టాబుట్టా సర్దేసుకుంటారు. మరోచోట కొత్త పెట్టబడులు పెడతారు. సంపాదించుకుంది జాగ్రత్తచేసుకునే పనిలో పడతారు. చైనాలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. చైనా కుబేరుల్లో అపనమ్మకం పెరుగుతోంది. వ్యాపారాలకు, పెట్టుబడులకు ఇక తమ దేశం ఎంతమాత్రం సురక్షితం కాదనుకుంటున్నారు. అందుకే చలో సింగపూర్‌ అంటున్నారు. అలీబాబా గ్రూప్‌పై చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం కత్తిగట్టింది. […]

అదానీకి దెబ్బ మీద దెబ్బ పార్లమెంట్‌ను తాకిన సెగ.. చర్చకు విపక్షాల పట్టు
4 February, 2023
అదానీకి దెబ్బ మీద దెబ్బ పార్లమెంట్‌ను తాకిన సెగ.. చర్చకు విపక్షాల పట్టు

హిండెన్ బర్గ్ నివేదిక దెబ్బకు అదానీ గ్రూప్ విలవిలలాడిపోతోంది. అదానీ కంపెనీల షేర్ల పతనం కొనసాగుతోంది. మదుపర్ల సంపద మరింత తరిగిపోతోంది. గత ఆరు ట్రేడింగ్‌ సెషన్‌లలో అదానీ గ్రూప్‌ లోని నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.8.76 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తమ సస్టైనబిలిటీ ఇండిసెస్‌ నుంచి తొలగిస్తున్నట్లు డోజోన్స్‌ ఎస్‌అండ్‌పీ తెలిపింది. ఇప్పటికే అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సహా అదానీ పోర్ట్‌, అంబుజా సిమెంట్‌ షేర్లను ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి తెచ్చినట్లు ఎన్‌ఎస్‌ఈ […]

పాపం చైనా.. ఎలాగైనా పిల్ల‌ల్ని క‌నేయ‌మంటోంది!
31 January, 2023
పాపం చైనా.. ఎలాగైనా పిల్ల‌ల్ని క‌నేయ‌మంటోంది!

పాపం చైనా. జ‌నాభాలో ప్ర‌పంచంలో అతి పెద్ద దేశానికి ప‌గ‌వాడికి కూడా రాకూడ‌ద‌న్న క‌ష్టం. ఒక‌ప్పుడు జ‌నాభా విస్ఫోట‌నానికి అడ్డుక‌ట్ట వేసేందుకు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించింది ఆ దేశం. ఇప్పుడేమో జ‌నాభా త‌గ్గిపోతోంద‌ని గింజుకుంటోంది. ఎలాగైనా పాపులేష‌న్ పెంచుకోవాల‌ని ఆరాట‌ప‌డుతోంది. ఆ ఆరాటం ఎంత‌దూరం వెళ్లిందంటే పెళ్లి త‌ర్వాత ముందు పిల్ల‌ల్ని క‌నేయ‌మంటోంది. పెళ్లికానివాళ్లూ పిల్ల‌ల్ని క‌నేయొచ్చ‌ని ఆఫ‌రిస్తోంది చైనా. ఇదివ‌ర‌కు కేవ‌లం వివాహిత‌జంట‌లు చ‌ట్ట‌బ‌ద్ధంగా పిల్ల‌ల్ని క‌నేందుకే డ్రాగ‌న్ కంట్రీలో అనుమ‌తి ఉంది. ఇప్పుడు పెళ్లి కాక‌పోయినా […]

1 2 26 27 28 30 31