ఆ దేశంలో మహిళల బొమ్మలకు కూడా ముసుగు వేయాల్సిందే
ఆఫ్గనిస్తాన్‌లో అరాచకం రాజ్యమేలుతోంది. కఠినమైన ఆంక్షలతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటినుంచి మహిళలు ఆంక్షల చట్రంలో ఇరుక్కుపోయారు. మహిళలు ఒంటరిగా బయటకు రావడానికి వీల్లేదని మగవారు తోడుగా ఉన్నా బురఖా తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేసి కఠినంగా అమలు చేస్తోంది తాలిబన్ ప్రభుత్వం. అమ్మాయిల చదువులు, ఉద్యోగాలపైనా నిషేధం విధించారు. ఇటీవలే యూనివర్సిటీలలో స్త్రీలకు ప్రవేశంలేదని తేల్చిచెప్పింది. జిమ్ లు, పబ్లిక్ పార్కులు, అమ్యూజ్ మెంట్ పార్కులలోకి కూడా మహిళలను అనుమతించట్లేదు. […]