ఓ మంత్రి సర్వేచేసేసి వ్యతిరేక ఉందని చెప్పేస్తారా!
18 January, 2023
ఓ మంత్రి సర్వేచేసేసి వ్యతిరేక ఉందని చెప్పేస్తారా!

తెలంగాణ రాజకీయం చిత్రంగా ఉంటుంది. విచిత్రంగా అనిపిస్తుంది. రాజకీయ చాణక్యుడైన కేసీఆర్‌ పార్టీలో ప్రతీ దానికో లెక్కుంటుంది. బీజేపీ బలపడుతున్న టైంలో నేతలెవరూ జారిపోకుండా ఆ మధ్య సీట్ల భరోసా ఇచ్చారు కేసీఆర్‌. సిట్టింగ్‌లంతా మళ్లీ పోటీచేస్తారని చెప్పారు. దీంతో అప్పటిదాకా మళ్లీ తమకు అవకాశం ఉంటుందోలేదోనని ఆందోళనపడ్డవారంతా స్థిమితపడ్డారు. అదే సమయంలో ఆ సీట్లపై ఆశలు పెట్టుకున్నవారు పునరాలోచనలో పడ్డారు. వరసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది గులాబీపార్టీ. ఒకటికి రెండుమూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలపై సహజంగానే వ్యతిరేకత […]

నిఘా పెరిగింది.. గులాబీనేత‌ల గుండెల్లో గుబులు
16 January, 2023
నిఘా పెరిగింది.. గులాబీనేత‌ల గుండెల్లో గుబులు

ఇంట్లో నాలుగ్గోడ‌ల మ‌ధ్య తుమ్మినా ఎవ‌రెన్నిసార్లు తుమ్మారో అధినేత‌కు తెలిసిపోతుంది. గోడ‌ల‌కు కూడా చెవులుంటాయ‌న్న విష‌యం బీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు అర్ధ‌మ‌వుతోంది. మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్ త‌ర్వాత ఫోన్ మాట్లాడాల‌న్నా, ప‌ర్స‌న‌ల్‌గా ఎవ‌రినైనా క‌ల‌వాల‌న్నా భ‌య‌ప‌డిపోతున్నారు గులాబీపార్టీ నేత‌లు. ఫాంహౌస్‌లో బేర‌సారాల‌కోసం వ‌చ్చిన ముగ్గురు బీజేపీ ప్ర‌తినిధుల్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టించార‌న్నంత‌వ‌ర‌కే బ‌య‌టికి తెలుసు. విష‌యం తెలిసి అధినాయ‌క‌త్వం ఆరాతీశాకే ఆ స్టింగ్ ఆప‌రేష‌న్ ప్లాన్ జ‌రిగింద‌ని చెబుతారు. ఏద‌యినా ఎన్నిక‌ల‌కు ప‌దినెల్ల‌లోపే స‌మ‌యం ఉంది. మొయినాబాద్ […]

కోమటిరెడ్డిని కాంగ్రెస్‌ బతిమాలుకుంటోందా!
13 January, 2023
కోమటిరెడ్డిని కాంగ్రెస్‌ బతిమాలుకుంటోందా!

పాపం కాంగ్రెస్‌. దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసినా అధికారంలోకి రాలేకపోయింది. పార్టీ ఉనికికోసం అదే గడ్డపై పాకులాడుతోంది. టీపీసీసీ నిట్టనిలువునా చీలిపోయింది. చివరికి అధినాయకత్వం రాష్ట్ర ఇంచార్జినే మార్చేసింది. అయినా పార్టీ బతికి బట్టకడుతుందన్న ఆశల్లేవు. కొత్త ఇంచార్జి మాణిక్‌రావ్‌ థాక్రే ప్రయత్నాలు మంచంమీద క్షణాలు లెక్కపెడుతున్న రోగికి తులసితీర్థం పోస్తున్నట్లే కనిపిస్తోంది. పార్టీ నిర్ణయాలను తప్పుపడుతూ మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కూడా దూరంగా ఉన్న నాయకుడ్ని బతిమాలుకోవాల్సి రావడం తెలంగాణ కాంగ్రెస్‌ […]

తెలంగాణకు తొలి మహిళా సీఎస్‌.. కొత్త సీఎస్‌గా శాంతికుమారికే ఛాన్స్‌
11 January, 2023
తెలంగాణకు తొలి మహిళా సీఎస్‌.. కొత్త సీఎస్‌గా శాంతికుమారికే ఛాన్స్‌

తెలంగాణ కొత్త చీఫ్‌ సెక్రటరీగా సీనియర్‌ ఐఏఎస్‌ శాంతికుమారిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్ సోమేశ్ కుమార్ హైకోర్టు ఆదేశాలతో రిలీవ్ కావడంతో ఆయన స్థానంలో శాంతికుమారిని నియమించారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి మహిళా సీఎస్‌గా శాంతి కుమారి రికార్డ్ సృష్టించారు. సోమేష్‌కుమార్‌ వెంటనే ఏపీ కేడర్‌కి రిపోర్ట్‌ చేయాలని హైకోర్టు బెంచ్‌ ఆదేశించటంతో తెలంగాణ ప్రభుత్వం వేగంగా స్పందించింది. కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియామకంపై అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమె వెంటనే బాధ్యతలు […]

1 2 99 100 101 124 125