మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యేల తిరుగుబాటు
19 December, 2022
మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యేల తిరుగుబాటు

ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకులు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిమీద తిరుగుబాటు ప్రకటించారు. ఇటు బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఐదుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డిపై తిరుబాటు ప్రకటించడం కలకలం రేపింది. మల్లారెడ్డి తీరుతో విసిగిపోయిన ఎమ్మెల్యేలు ఆయనపై బహిరంగంగానే తమ అసమ్మతిని వ్యక్తం చేయడం కీలకమైన పరిణామంగా చెప్పవచ్చు. ఎమ్మెల్యే మైనంప‌ల్లి నివాసంలో కుత్బూల్లాపూర్‌, కూక‌ట్‌ప‌ల్లి, శేరిలింగంప‌ల్లి, ఉప్ప‌ల్ ఎమ్మెల్యేలు వివేక్‌గౌడ్‌, మాధ‌వ‌రం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, […]

పెనంమీంచి పొయ్యిలోకి.. టీకాంగ్రెస్‌ సర్వనాశ్‌!
17 December, 2022
పెనంమీంచి పొయ్యిలోకి.. టీకాంగ్రెస్‌ సర్వనాశ్‌!

యుద్ధభేరీ మోగింది. శత్రుసేనలు కదనరంగంలోకి కాలుమోపాయి. సైన్యాధ్యక్షుడు సైగచేస్తే చాలు విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ దేశంలోనే సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆ పార్టీ సేనలు మాత్రం అడుగుబయటపెట్టలేదు. పైగా సొంత సైన్యాధ్యక్షుడిమీదే కత్తిదూస్తున్నాయి. శత్రువులెవరూ చీల్చిచెండాల్సిన పన్లేదు. వీళ్లకు వీళ్లే తలలు తెగనరుక్కునేలా ఉన్నారు. నాటకీయంగా చెప్పినా తెలంగాణకాంగ్రెస్‌ పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. గతంలో ఓ వీహెచ్‌ లేదంటే ఓ కోమటిరెడ్డి. అప్పుడప్పుడూ జగ్గారెడ్డి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో సీన్‌మారింది. పెద్దమనిషిలా వ్యవహరించే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, […]

కేసీఆర్‌ అండ్‌ కో టార్గెట్‌గా కేంద్రం తీన్మార్‌
17 December, 2022
కేసీఆర్‌ అండ్‌ కో టార్గెట్‌గా కేంద్రం తీన్మార్‌

లెక్క బరాబర్‌. ఇంకా బరాబర్‌ కూడా కాలేదేమో.. బార్‌బార్‌ తీన్మార్‌ అంటోంది కేంద్రం. ఐటీ, ఈడీ, సీబీఐ బీజేపీ చేతిలో ముచ్చటగా మూడు బ్రహ్మాస్త్రాలు. పుట్టలో వేలెడితే కుట్టకుండా వదులుతామా అన్నట్లుంది కేంద్రప్రభుత్వ రియాక్షన్‌. మీరు నోటీసులు పంపితే మేం ఎంక్వయిరీలదాకా వెళ్తామని హెచ్చరికలు చేస్తున్నట్లుంది పరిస్థితి చూస్తుంటే. ఫాంహౌస్‌కేసులో బీజేపీ కేంద్రపెద్దలకు సన్నిహితుడైన రామచంద్రభారతితో పాటు మరో ఇద్దరు దొరికినా టీఆర్‌ఎస్‌ అంతకంటే ముందుకెళ్లలేకపోతోంది. ముగ్గురినీ అరెస్ట్‌చేసి జైలుకు పంపింది. బీజేపీ జాతీయ నేత బీఎల్‌ […]

కాంగ్రెస్‌ ఎంపి కోమటిరెడ్డికి మోదీ అపాయింట్‌మెంట్‌
15 December, 2022
కాంగ్రెస్‌ ఎంపి కోమటిరెడ్డికి మోదీ అపాయింట్‌మెంట్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఎం.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంతకాలంగా పీసీసీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ఆయనకు పొసగడం లేదు. ఆయనొక్కరే కాదు పార్టీలో ఉన్న చాలామంది సీనియర్‌ నేతలు రేవంత్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్నవారే. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరగింది. ఆ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఆయన […]

1 2 107 108 109 124 125